Venkatesh1

Apr 22 2024, 07:27

బుక్కరాయసముద్రం మండలంలో మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సాకే శైలజనాథ్ విస్తృత ప్రచారం

బుక్కరాయసముద్రం మండలం 2024 ఎన్నికల ప్రచారంలో భాగంగా సంజీవపురం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి భీమిరెడ్డి గోవిందరెడ్డి ఆధ్వర్యంలో100 కుటుంబాలు డాక్టర్ సాకే శైలజనాథ్ సమక్షంలో చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు బండ్లపల్లి ప్రతాపరెడ్డి జిల్లా ఓబీసీ అధ్యక్షుడు రామ్ చరణ్ యాదవ్ బుక్కరాయసముద్రం కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ మారిసెట్టి సురేష్ నార్పల కన్వీనర్ రామాంజనేయులు ఎస్సీ సెల్ నాయకుడు అంజి సింగనమల యూత్ కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులు భీమ్ రెడ్డి పెద్దిరెడ్డి R మునిరెడ్డి నాయకుడు మారుతి మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరియు సంజీవపురం గ్రామస్తులు

Venkatesh1

Apr 22 2024, 07:16

చరిత్రలో నిలిచిపోయేలా జగనన్న పాలన.. సంక్షేమ పాలన కొనసాగలంటే.."ఫ్యాన్"కు ఓటు వేయాలి.. ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు

చరిత్రలో నిలిచిపోయేలా జగనన్న పాలన.. సంక్షేమ పాలన కొనసాగలంటే.."ఫ్యాన్"కు ఓటు వేయాలి.. ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు

◆ టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు

దేశ చరిత్రలో ఎవరికీ సాధ్యంకాని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన అందించారని, ప్రజలు ఓట్లు వేసి పట్టం కట్టాలని శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు అన్నారు.

పుట్లూరు మండలం శనగలగూడూరు, తక్కళ్లపల్లి, పోతిరెడ్డిపల్లి, గాండ్లపాడు, ఎస్.తిమ్మాపురం, కొండేపల్లి గ్రామాలలో " మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా వైయస్సార్ గడపగడపకు ఎన్నికల ప్రచారాన్ని పార్టీ శ్రేణులతో కలసి వీరాంజనేయులు చేపట్టారు.

గ్రామాల్లోని ప్రజలు, పార్టీ శ్రేణులు శాలువాలతో సత్కరించి, పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు. మహిళలను, వృద్ధులను పలకరిస్తూ, జగనన్న పాలన ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలతో, పింఛన్లులతో సంతోషంగా ఉన్నామని చెప్పారు. ఇంటింటికీ వెళ్లి "ఫ్యాన్"గుర్తుకు ఓటు వేసి మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థిస్తూ కరపత్రాలు అందజేశారు.

వీరాంజనేయులు మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో అభివృద్ధి, సంక్షేమ పథకాల ఊసే లేకుండా ప్రజలను అన్ని విధాలా మోసం చేసారని తెలియజేశారు. జగనన్న పాలనలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంతో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారన్నారు. నేరుగా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనే దమ్ము లేక చంద్రబాబు నాయుడు వివిధ పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. గెలుపు కోసం ఆయన ఇలా ఎన్ని పార్టీలతో కలసి వచ్చిన ఫలితం శూన్యం అన్నారు. జగనన్న ఐదేళ్లలో అందించిన ప్రజారంజక పాలనను చూసిన టీడీపీ, జనసేన,బీజేపీ ఓటమి భయంతో పొత్తులతో వస్తున్నారన్నారు. అధికారం కోసం కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్న బాబుకు ప్రజలు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. "ఫ్యాన్" గుర్తుకు ఓటు వేసి జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

Venkatesh1

Apr 21 2024, 07:57

చంద్రబాబునాయుడు గారిని కలిసి పుష్పగుచ్చం అందజేసిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం కనేకల్ మండలానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారిని కలిసి పుష్పగుచ్చం అందజేసిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారు,ద్విసభ్య కమిటి సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి గారు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు

Venkatesh1

Apr 21 2024, 07:49

గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా పని చేస్తా : టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ

శింగనమల  నియోజకవర్గం శింగనమల మండలం గుమ్మేపల్లి గ్రామం..

గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా పని చేస్తా : టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ

గుమ్మేపల్లి గ్రామం ఎన్నికల పర్యటనలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు గుమ్మేపల్లి గ్రామంలో ప్రజల సమక్షంలో జరుపుకోవడం చాలా సంతోషకర విషయమని బండారు శ్రావణి శ్రీ గారు తెలియజేశారు. 

   ఈ సందర్భంగా గుమ్మేపల్లి గ్రామంలో ప్రజలను కార్యకర్తలను ఉద్దేశించి  బండారు శ్రావణి శ్రీ గారు మాట్లాడుతూ గ్రామంలో తాగునీటి సమస్య లేకుండా తన వంతు కృషి చేస్తానని గ్రామ అభివృద్ధికి తోడ్పడుతానని వచ్చే ఎన్నికల్లో అందరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కార్యకర్తలను నాయకులను మరియు గ్రామస్తులను కోరడం జరిగింది.

 అనంతరం జనసేన పార్టీ శింగనమల మండల అధ్యక్షుడు తోట ఓబులేసు గారి స్వగృహానికి విచ్చేసిన బండారు శ్రావణశ్రీ గారికి గజమాలతో ఆహ్వానం పలికారు.

 ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి మండల నాయకులు కార్యకర్తలు మహిళలు యువత తదితరులు పాల్గొన్నారు.

Venkatesh1

Apr 21 2024, 07:38

ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు "పల్లె నిద్ర"

ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు "పల్లె నిద్ర"

గ్రామాల్లో ప్రజల కష్టాలను ప్రజా సమస్యలను ప్రత్యక్ష పరిశీలించి పరిష్కరించటం కోసమే పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు తెలిపారు.

గ్రామాల్లో పల్లె నిద్ర చేయడం చాలా సంతోషకరంగా ఉందని, అలాగే రైతుల, ప్రజల సమస్యలు తెలుసుకున్నానని, సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు.

మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా గడపగడపకు వైయస్సార్ ఎన్నికల ప్రచారం అనంతరం శింగనమల మండలం సోదనపల్లి గ్రామంలో "పల్లె నిద్ర" కార్యక్రమాన్ని  వీరాంజనేయులు నిర్వహించారు.

స్థానికులతో కలసి సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి వైయస్ జగనన్న చేసిన సంక్షేమం, అభివృద్ధి గురించి వివరించి, జరిగిన లబ్ధిని వారిని అడిగి తెలుసుకున్నారు.

అనంతరం కాలనీలో బస చేశారు.

Venkatesh1

Apr 21 2024, 07:31

గ్రామాలే తరిలి వస్తున్నాయి టిప్పర్ డ్రైవర్ కు ఎన్నికల ప్రచారంలో

జన హృదయాల్లో జగనన్నకు సుస్థిర స్థానం

రోజురోజుకూ పెరుగుతున్న ప్రజాదరణ

ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు వీరాంజనేయులు, శంకర్ నారాయణ

టిడిపి మాయమాటలు నమ్మవద్దు

వైఎస్సార్సీపీ తోనే సంక్షేమాభివృద్ధి.

అందరికీ మంచి చేసే జగనన్నకు ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం ఉందని శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు, అనంతపురం ఎంపీ అభ్యర్థి ఎం. శంకర్ నారాయణ అన్నారు.

శింగనమల మండలం చిన్నమట్లగొంది, పెద్ద మట్లగొంది, ఈస్ట్.నరసాపురం, సోదనపల్లి గ్రామాలలో "మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా గడపగడపకు వైయస్సార్ ఎన్నిక ప్రచారాన్ని పార్టీ శ్రేణులు, రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డిలతో కలసి వీరాంజనేయులు, శంకర్ నారాయణ చేపట్టారు.

ఆయా గ్రామాల ప్రజలు, పార్టీ శ్రేణులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అడుగడుగునా ఘనంగా స్వాగతం పలికారు. ఇంటింటికీ వెళ్లి జగనన్న చేసిన మంచిని వివరించారు. రానున్న ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తమను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

వారు మాట్లాడుతూ.. సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టి చరిత్రలో నిలిచిపోయేలా పాలన అందించారన్నారు. అటువంటి గొప్ప పాలనలో తాము కూడా భాగస్వామ్యం అయినందుకు ఎంతో గర్వంగా ఉందన్నారు. వైఎస్ఆర్సిపి తోనే సంక్షేమం అభివృద్ధి సాధ్యమన్నారు. టిడిపి ఐదేళ్ల పాలనలో పేదలకు సంక్షేమాన్ని దూరం చేసిందన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో విధ్వంస పాలన సాగించారన్నారు. కూటమి పేరుతో ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. ఈ మోసాలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎం గా చేస్తే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులమైన తమను "ఫ్యాన్" గుర్తుకు ఓటు వేసి మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Venkatesh1

Apr 20 2024, 15:16

Flash.. Flash.. మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేసిన వీరాంజనేయులు

మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేసిన వీరాంజనేయులు

శింగనమల నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేశారు.

వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు పైలా నరసింహయ్య, రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ చిక్కాల బాలకృష్ణ లతో కలసి వీరాంజనేయులు నామినేషన్ దాఖలు చేశారు.

తహశీల్దార్ కార్యాలయంలో ఎన్నికల అధికారి వెన్నెల శ్రీను కి నామినేషన్ పత్రాలు అందజేశారు.

ఈ నెల 24 తేదీన బుధవారం వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యులందరి సమక్షంలో, అందరి మద్దతుతో, భారీ జన సందోహం మధ్య భారీ స్థాయిలో రెండవ సెట్ నామినేషన్

 దాఖలు చేయనున్నారు.

Venkatesh1

Apr 19 2024, 07:25

స్థానికుడిని అందుబాటులో ఉంటా... ఆదరించండి.. ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు..

స్థానికుడిని అందుబాటులో ఉంటా... ఆదరించండి..

ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు

◆ జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం

◆ సంక్షేమ పాలనను కొనసాగించుకుందాం.

◆ ఓట్ల కోసం టీడీపీ అబద్ధపు నెరవేర్చని హామీలు

ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కల్పించారని ఒకసారి అవకాశం ఇవ్వండని ఎం. వీరాంజనేయులు ప్రజలను కోరారు.

నార్పల మండలం గడ్డంనాగేపల్లి, వెంకటాంపల్లి, మద్దలపల్లి, నాయనపల్లి, నడిమిదొడ్డి గ్రామాలలో " మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా గడపగడపకు ఎన్నికల ప్రచారాన్ని పార్టీ శ్రేణులు, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎగ్గుల శ్రీనివాసులు, జిల్లా మైనార్టీ అధ్యక్షులు సైపుల్లా బేగ్ లతో కలసి వీరాంజనేయులు చేపట్టారు.

అడుగడుగునా గ్రామాల్లో ఆత్మీయంగా హారతులతో ఘన స్వాగతం పలికారు. ఇంటింటికీ వెళ్లి అవ్వా తాతలను ఆప్యాయంగా పలకరిస్తూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్న ఐదేళ్ల పాలన చేసిన సంక్షేమాన్ని ఆయా కుటుంబాలకు వివరించారు. స్థానికుడిగా ప్రజలందరికీ అందుబాటులో ఉంటా.. మంచి చేస్తా.. నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తానని, రానున్న ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లని అభ్యర్థించారు.

వీరాంజనేయులు మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు ఓట్ల కోసం అపద్దపు హామీలతో వస్తున్నారన్నారు. 2014లో టిడిపి అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. ప్రభుత్వ పథకాలు అందాలంటే టిడిపి హయంలో ప్రజలు కార్యాలయం చుట్టూ తిరుగుతూ పడిగాపులు కాసేవారన్నారు. 2019 లో వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చాక పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని జగనన్న నెరవేర్చారన్నారు. ఇంటింటికి సంక్షేమాన్ని అందించి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న జగనన్న మరోసారి ముఖ్యమంత్రిగా కావాలని గ్రామాల్లో ప్రజలు కోరుకుంటున్నారన్నారు. నియోజకవర్గంలో టిడిపి వాళ్లు చేస్తున్న ప్రచారంలో ప్రజలు కరువయ్యారన్నారు. జగనన్నపై విమర్శలు తప్ప ప్రజలకు ఏం చేస్తామో టీడీపీ గట్టిగా చెప్పలేకపోతున్నారన్నారు. రానున్న ఎన్నికలలో చంద్రబాబు నాయుడును ఓడించి ఇంటికే పరిమితం చేయాలని పిలుపునిచ్చారు. 

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Venkatesh1

Apr 18 2024, 07:39

ఇండియా వేదిక ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయండి..

బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో ఇండియా వేదిక ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. 

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు సురేష్ సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఓ నల్లప్ప సిపిఎం నాయకులు నాగేంద్ర,రఫీ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ

రేపు నార్పల మండల కేంద్రంలో గాంధీ సర్కిల్ నందు సాయంత్రం నాలుగు గంటలకి ఇండియా వేదిక ఆధ్వర్యంలో సింగనమల నియోజకవర్గ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ శైలజనాథ్ ను గెలిపించాలని కోరుతూ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిల రెడ్డి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.రాంభూపాల్, సిపిఐ నాయకులు పాల్గొంటారు.

రాష్ట్రంలో ఉన్న పాలక పార్టీలు బిజెపికి తొత్తులుగా పనిచేస్తున్నాయి. రాష్ట్రానికి ద్రోహం చేసి నాటకాలు ఆడుతున్న బిజెపి దాని మిత్రపక్షాలను ఓడించాలని పరోక్షంగా మద్దతు ఇస్తూ వైసిపి రాజధాని ఎక్కడో తెలియని స్థితిలోకి నెట్టింది. సింగనమల నియోజకవర్గం లో అవినీతి అక్రమాలు బాగా పెరిగాయని 2014 ముందు నియోజకవర్గ అభివృద్ధి కోసం చేసిన అనేక పనులు, సంక్షేమ పథకాలను ఇప్పటికీ అమలులోకి నోచుకోలేదు. గార్లదిన్నె ఐదవ డిస్ట్రిబ్యూటరీ కాలువ ఆధునికరణ పనులు, సింగనమల నియోజకవర్గంలోని రాచేపల్లి లెదర్ పార్కును మూసివేసి ఏళ్లు గడుస్తున్నా పునరుద్ధరణ చేయలేదు, నార్పల లో డిగ్రీ కళాశాల, పుట్లూరులో జూనియర్ కళాశాల ప్రారంభించలేదు. ప్రజా సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు ఉన్నాయి. పాలక పార్టీలు వ్యక్తిగత దూషణలు తప్ప ప్రజా సంక్షేమం గురించి మాట్లాడడం మానేశాయి. ఈ పరిస్థితులలో భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ప్రజాతంత్ర హక్కుల కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇండియా వేదిక రాష్ట్రంలో కాంగ్రెస్ సిపిఐ సిపిఎం ఇతర కలిసి వచ్చే పార్టీలతో అవగాహన చేసుకుని ఎన్నికలలో పోటీ చేస్తున్నాయి. సింగనమల నియోజకవర్గం నుండి మాజీ మంత్రివర్యులు డాక్టర్ సాకే శైలజనాథ్ పోటీ చేస్తున్నారు. వారిని గెలిపించాలని కోరుతూ రేపు జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

Venkatesh1

Apr 18 2024, 07:43

ఉమ్మడి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల బండారి శ్రావణి శ్రీ, అంబికా లక్ష్మీనారాయణ గెలుపు కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టిన.. ఆలం నరసా నాయుడు

శిoగనమల నియోజకవర్గం నార్పల మండలం కూరగానిపల్లి గ్రామo లో శిoగనమల నియోజకవర్గ (టిడిపి జనసేన బిజెపి )ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ గారు,ఉమ్మడి ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మి నారాయణ గారి గెలుపు కొరకు గ్రామo లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేసిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి,ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు గారు

గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఈ ఐదు సంవత్సరాల వైసిపి ప్రభుత్వం అరాచకాలను తెలియజేసారు.ఈ కార్యక్రమం లో టీడీపీ జిల్లా నాయకులు ఆలం వెంకట నరసానాయుడు గారు,ఆకుల ఆంజనేయులు గారు పాల్గొన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి అఖండ మెజార్టీతో బండారు శ్రావణి శ్రీ గారిని గెలిపించాలని,ఎంపీ గా అంబికా లక్ష్మి నారాయణ గారిని గెలిపించాలని,మళ్లీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని తెలియజేశారు. 

ఈ సందర్బంగా ఆలం నరసానాయుడు మాట్లాడుతూ చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలంటే ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కావాలని, జగన్మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ అని మెగా డీఎస్సీ విడుదల చేస్తానని కళ్ళబోల్లి మాటలు చెప్పి పబ్బం గడుపుకున్నాడే తప్ప చదువుకుని నిరుద్యోగులుగా ఉన్న యువత గురించి ఒక్క సారి కూడా ఆలోచించలేదని అందుకే ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ది చెప్పి తెలుగుదేశం పార్టీ గెలుపుకోసం పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ ఐదేళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి పాలనాలో రాష్ట్రం ముందుకు వెళ్లకుండా అభివృద్ధిలో వెనక్కు వెళ్లిందని కేవలం సంక్షేమ పథకాలు ఇస్తున్నామంటూ గొప్పలు చెప్పి అభివృద్ధి, పాలనను గాలికి వదిలేశారని, ఒక్క ఛాన్స్ అని నమ్మి ఓట్లేసిన ప్రజలకు గుదిబండలాగా తయారైందని

అందుకే ముందు చూపు, విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తెచ్చుకోవాలని అప్పుడే రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి పాలన ముందుకు సాగి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని తెలియజేశారు.

ఈ కార్యక్రమం లో మండలం లోని సీనియర్ నాయకులు,మండల అధ్యక్షులు,మాజీ మండల అధ్యక్షులు,సర్పంచ్ లు, మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, మాజీ ఎంపీటీసీ లు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇంచార్జ్ లు, గ్రామ కమిటి అధ్యక్షులు,తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ,బిజెపి పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు